జెట్‌ స్పీడ్‌లో బన్నీ... మరీ స్పీడ్‌ వద్దంటున్న ఫ్యాన్స్‌

అల్లు అర్జున్‌ హీరోగా ‘నా పేరు సూర్య’ వచ్చి సంవత్సరం దాటింది.మరో సినిమాతో బన్నీ ఇప్పటి వరకు రాలేదు.

 Allu Arjun Movie Going To Jet Speed In Triikram Movie-TeluguStop.com

దాదాపు సంవత్సరం పాటు కెమెరాకు దూరం ఉన్న బన్నీ తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీకి ఓకే చెప్పాడు.ఇటీవలే ఆ సినిమా ప్రారంభం అయ్యింది.

శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో బన్నీ పాల్గొంటున్నాడు.

ఇదే సమయంలో మరో రెండు సినిమాల గురించిన చర్చలు జరుగుతున్నాయి.

జెట్‌ స్పీడ్‌లో బన్నీ మరీ స్�

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌ మూవీ చేస్తూనే సుకుమార్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.త్రివిక్రమ్‌ మూవీ పూర్తి అయ్యేలోపు సుకుమార్‌ మూవీ సగంకు పైగా పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నాడట.ఇదే సమయంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ప్లాన్‌ చేశాడు.

ఆ సినిమాకు ‘ఐకాన్‌’ అనే విభిన్నమైన టైటిల్‌ను పెట్టడం జరిగింది.ఈ మూడు సినిమాలు కూడా కేవలం సంవత్సరం గ్యాప్‌లో వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు.

బన్నీ మరీ ఇంత స్పీడ్‌గా సినిమాలు చేయడం వల్ల కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయాలను ఒకటికి రెండు సార్లు అంటూ పదే పదే క్రాస్‌ చెక్‌ చేసుకుని మరీ తెరకెక్కిస్తున్నారు.

అందుకే స్టార్‌ హీరోల సినిమాలు సంవత్సరాలు పడుతున్నాయి.మరి అలాంటిది ఒక్క సంవత్సరంలో మూడు సినిమాలు ఎలా బాసూ అంటూ బన్నీని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.కాస్త స్లోగానే మంచి సినిమాలు చేయాలంటూ మెగా ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube