బన్నీ ఖాతాలో ఎన్ని హిట్‌లో.. చేసినవి కాదు వదులుకున్నవి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో అనే బ్లాక్‌బస్టర్‌ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తన సత్తాను మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు.

 Allu Arjun, Ala Vaikunthapuramulo, Sukumar, Trivikram-TeluguStop.com

అయితే బన్నీ కెరీర్‌లో హిట్‌లతో పాటు ఫ్లాపులు కూడా ఉన్నాయి.కానీ తన కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు.

బన్నీ తొలిచిత్రం గంగోత్రి సమయంలో దర్శకుడు తేజ ఆయనకు జయం కథ వినిపించాడు.కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.ఇక ఆ తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భద్ర సినిమాను కూడా బన్నీ చేయాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లడం సూపర్ హిట్‌గా నిలవడం జరిగింది.అటుపై సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది.

కానీ ఆ సినిమా నాగ చైతన్యకు వెళ్లింది.

గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘పండగ చేస్కో’ సినిమా కూడా బన్నీకే తొలి అవకాశం వచ్చింది.

కానీ ఆ సినిమా యంగ్ హీరో రామ్ ఎగరేసుకుపోయాడు.ఆ తరువాత ఒక లైలా కోసం, అర్జున్ రెడ్డి, గ్యాంగ్ లీడర్, డిస్కో రాజా, గీతా గోవిందం, అరవింద సమేత వంటి సినిమాలు కూడా తొలుత బన్నీయే చేయాల్సినవి.

కానీ వాటిని బన్నీ పలు కారణాలతో వదులుకున్నాడు.ఇలా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను బన్నీ వదులుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు.

కానీ ప్రస్తుతం టాప్ స్టార్స్‌లో ఒకడిగా బన్నీ ఉండటం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube