కామెడీకి ఓటేసిన బన్నీ.. అనుకున్నదే అయ్యేలా ఉంది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పూర్తి మాస్ లుక్‌లో బన్నీ కనిపిస్తాడు.

 Allu Arjun Next Movie Comedy Genre With Maruthi, Allu Arjun, Maruthi, Pushpa, Su-TeluguStop.com

ఇక ఈ సినిమాతో బన్నీ-సుక్కు కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాలై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే పుష్ప సినిమా తరువాత దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని క్యూలో పెట్టాడు బన్నీ.ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

ప్రేక్షకులు ఈ సినిమా కోసం అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ క్రమంలో బన్నీ మరో సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడట.

ఈ మేరకు మారుతికామెడీ సబ్జెక్ట్‌ను బన్నీ కోసం రెడీ చేస్తున్నాడట.

ఈ కథకు సంబంధించిన స్టోరీలైన్‌ను ఇప్పటికే బన్నీకి వినిపించగా ఆయన కథను రెడీ చేయాల్సిందిగా కోరాడట.దీంతో మారుతి ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు.

అయితే ఈ సినిమా విషయంలో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.ఇక బన్నీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి కామెడీ సబ్జెక్టుకు బన్నీ ఓకే చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube