బన్నీ లైనప్ లో మార్పు.. పుష్ప1 తర్వాత ఏం సినిమా చేయబోతున్నాడంటే?

Allu Arjun Lineup Change Due To Pushpa Part 2 Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 Allu Arjun Lineup Change Due To Pushpa Part 2 Movie-TeluguStop.com

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మొదటిసారి ఎంట్రీ ఇస్తుండడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయడానికి మేకర్స్ అంత సిద్ధం అయ్యారు.

ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

 Allu Arjun Lineup Change Due To Pushpa Part 2 Movie-బన్నీ లైనప్ లో మార్పు.. పుష్ప1 తర్వాత ఏం సినిమా చేయబోతున్నాడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పుష్ప 1 ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని పార్ట్ 2 ను షూట్ చేయాలనీ మొదటగా భావించారు.ఈ గ్యాప్ లో సుకుమార్ ఒక సినిమా, అల్లు అర్జున్ ఒక సినిమా పూర్తి చెయ్యాలి అని అనుకున్నారు .అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ లెక్కలన్నీ మారిపోయాయని తెలుస్తుంది.

పుష్ప 1 తర్వాత గ్యాప్ తీసుకోవాలని అనుకోవడంతో అల్లు అర్జున్ తన తర్వాత సినిమాను లైనప్ చేసాడు.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Sukumar, Tollywood-Movie

కానీ ఇప్పుడు సుకుమార్ పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినా వెంటనే పార్ట్ 2 స్టార్ట్ చెయ్యాలని పట్టుబడుతున్నాడట.ఇప్పటికే పార్ట్ 2 సినిమా కూడా కొద్దిగా షూటింగ్ జరిగింది.ఇంకా స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉండడంతో పార్ట్ 2ను వెంటనే చెయ్యాలని సుకుమార్ అల్లు అర్జున్ ను కోరుతున్నాడట.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Sukumar, Tollywood-Movie

అందుకే అల్లు అర్జున్ లైనప్ లో మార్పులు జరగబోతున్నాయని తెలుస్తుంది.పుష్ప పార్టు 2 చేసిన తర్వాతనే మరొక సినిమా చేయాలనీ అల్లు అర్జున్ కూడా ఫిక్స్ అయ్యాడట.ఇక ఇప్పటికే ఐకాన్ స్టార్ పుష్ప రాజ్ గెటప్ చేంజ్ కూడా చెయ్యలేదు.

ఇక పార్ట్ 2 సినిమా వెంటనే మొదలు పెడితే ఇక 2022 లో కూడా పుష్ప రాజ్ గానే అల్లు అర్జున్ కనిపించ బోతున్నాడు.మరి చూడాలి చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో.

#Pushpa #Allu Arjun #ArjunLineup #Pushpa #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube