బన్నీ కారణజన్ముడు అంటోన్న దర్శకుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేయడంతో పాటు బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

 Allu Arjun Koratala Siva Title Karanajanmudu, Allu Arjun, Koratala Siva, Karanaj-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తనదైన మార్క్‌తో తెరకెక్కించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలో బన్నీ నటిస్తున్నాడు.ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సమయంలో బన్నీ తన నెక్ట్స్ మూవీని ఓకే చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తన నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు బన్నీ తెలిపాడు.కాగా ఈ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను కొరటాల ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు ‘కారణజన్ముడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.బన్నీని మరో లెవెల్‌లో చూపించబోయే ఈ సినిమాతో ఆయన నిజంగానే కారణజన్ముడు అని అభిమానులు అనేలా చేస్తాడట కొరటాల.

మొత్తానికి చిత్ర టైటిల్‌తోనే ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన కొరటాల, బన్నీ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాను అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

కాగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే పుష్ప చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని బన్నీ చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube