ముందు స్టూడెంట్ లీడర్.. ఆ తరువాతే సీఎం అంటోన్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Allu Arjun As Student Leader Then Cm, Allu Arjun, Koratala Siva, Mahi V Raghava,-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బన్నీ ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న కొరటాల, తన నెక్ట్స్ చిత్రాన్ని బన్నీతో తీయాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో బన్నీ కోసం ఓ అదిరిపోయే కథను కూడా రెడీ చేశాడట.

ఇందులో బన్నీ ఓ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ చిత్రాన్ని యాత్ర చిత్ర దర్శకుడు మహి వి రాఘవతో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో బన్నీ ఓ యంగ్ సీఎం పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఇలా స్టూడెంట్ లీడర్ నుండి సీఎం వరకు బన్నీ చాలా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటుండటంతో ఆయన ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.

అయితే ఇలా వరుసగా పొలిటికల్ అంశాలు ఉన్న కథలను బన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాడనే ప్రశ్న వారిలో నెలకొంది.మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube