బన్నీ 21 హీరోయిన్‌ ఎవరో తెలుసా?  

Allu Arjun to Romance kiara Advani, kiara Advani, koratala Siva, Bunny21 Movie, Allu Arjun, Allu Arjun with Kiara - Telugu Allu Arjun, Allu Arjun To Romance Kiara Advani, Allu Arjun With Kiara, Bunny21 Movie, Kiara Advani, Koratala Siva

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

 Allu Arjun Koratala Siva Kiara Advani

వీరిద్దరు కలిసి చేయబోతున్న రొమాన్స్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాని పుష్పకు అప్పుడే హైప్‌ చాలా వచ్చింది.

ఇదే సమయంలో బన్నీ తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తన 21వ చిత్రాన్ని బన్నీ చేయబోతున్నాడు.

బన్నీ 21 హీరోయిన్‌ ఎవరో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

వచ్చే ఏడాది సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభించి 2022 సంవత్సరంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

సినిమా ప్రారంభంకు ఇంకా చాలా సమయం ఉంది.అయినా ఇప్పటికే హీరోయిన్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.కొరటాల శివ గత చిత్రం భరత్‌ అనే నేను లో హీరోయిన్‌ గా నటించిన కియారా అద్వానీని ఈ చిత్రం కోసం సంప్రదించారట.బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు అదే పారితోషికంతో సౌత్‌లో నటించేందుకు కూడా సిద్దంగా ఉంది.

అందుకే బన్నీకి జోడీగా ఆమెను సెట్‌ చేశారట.

కొన్ని రోజుల క్రితం ఒక తెలుగు సినిమా కోసం ఆమెను సంప్రదించగా నో చెప్పింది.కాని కొరటాల శివ అడగడంతో కాదనలేక పోయినట్లుగా సమాచారం అందుతోంది.దానికి తోడు షూటింగ్‌ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కాబోతుంది కనుక డేట్లు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఈమెకు ఉంది.

అందుకే బన్నీకి జోడీగా నటించేందుకు ఈమె ఓకే చెప్పిందట.

#Kiara Advani #Koratala Siva #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Koratala Siva Kiara Advani Related Telugu News,Photos/Pics,Images..