బన్నీ కొరటాల మూవీ స్టోరీ లైన్ లీక్.. ఆ కాన్సెప్ట్ తో..?

మిర్చి సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన కొరటాల శివ తొలి సినిమా నుంచి డైరెక్షన్ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

 Allu Arjun Koratala Shiva Movie Story Line Leaked-TeluguStop.com

ప్రస్తుతం చిరంజీవి, చరణ్ లతో కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఆచార్య మూవీలో చరణ్, పూజా హెగ్డే పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా చిరంజీవికి సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ జరగాల్సి ఉంది.

 Allu Arjun Koratala Shiva Movie Story Line Leaked-బన్నీ కొరటాల మూవీ స్టోరీ లైన్ లీక్.. ఆ కాన్సెప్ట్ తో..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మే 13వ తేదీన ఆచార్య విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమాతో చిరంజీవి, చరణ్ లకు కొరటాల శివ మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రతి సినిమాలో ఒక సందేశం ఉండేలా జాగ్రత్త పడే కొరటాల శివ ఆచార్య సినిమాను దేవాలయాల కుంభకోణాలకు సంబంధించిన కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆచార్య సినిమా తరువాత బన్నీ కొరటాల శివ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది.జల కాలుష్యానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి 2022 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని కొరటాల శివ భావిస్తున్నారని సమాచారం.బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

కొరటాల శివ ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమాతో బన్నీకి కొరటాల శివ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్ లో పాల్గొంటుండగా ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

#Bunny #Pushpa #Allu Arjun #Story Line #Water Pollution

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు