చిరంజీవి-కొరటాల సినిమాలో కీలక పాత్రలో అల్లు అర్జున్  

Allu Arjun Key Role In Chiranjeevi-koratala Movie - Telugu Allu Arjun Key Role, Chiranjeevi-koratala Movie, Mega Family, South Cinema, Tollywood

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Allu Arjun Key Role In Chiranjeevi-koratala Movie - Telugu Allu Arjun Key Role, Chiranjeevi-koratala Movie, Mega Family, South Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

రాజమండ్రిలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయిపొయింది.షూటింగ్ కోసం అక్కడ గోదావరి పరిసర ప్రాంతాలలో సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది.

కొరటాల గత సినిమాల తరహాలోనే ఇందులో కూడా ఓ సామాజిక కోణం చూపించబోతున్నట్లు తెలుస్తుంది.ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.

ఇందులో చిరంజీవి ఎండోమెంట్ ఆఫీస్ లో ఉద్యోగిగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమాలో ఇతర నటుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

కాని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని గత కొద్ది రోజులు టాక్ వినిపిస్తుంది.అయితే ఇప్పుడు రామ్ చరణ్ చేయడం లేదనే అతని స్థానంలో మరో మెగా హీరో అల్లు అర్జున్ ని ఫైనల్ చేసారనే మాట బలంగా వినిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినంత వరకు వేరే ప్రాజెక్ట్ చేయకూడదని రాజమౌళి చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో ఈ సినిమా నుంచి రామ్ చరణ్ తప్పుకున్నాడని ఇండస్ట్రీలో టాక్.దీంతో రామ్ చరణ్ పాత్ర కోసం కొరటాల అల్లు అర్జున్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక మెగాస్టార్ మూవీ కావడంతో అల్లు అర్జున్ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా చేయడానికి ఒకే చెప్పాడని చెప్పుకుంటున్నారు.ఇది వరకే అల్లు అర్జున్ ఎవడు, రుద్రమ్మదేవి సినిమాలలో ప్రత్యేక పాత్రలలో కనిపించాడు.

ఈ నేపధ్యంలో మరో సారి చిరంజీవి సినిమాలో స్పెషన్ అప్పీరియన్స్ ఉన్న పాత్రలో మెరుస్తాడని సమాచారం

.

తాజా వార్తలు