హిందీలో రీమేక్ అవుతున్న అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు  

Allu Arjun Julayi and Race Gurram Movie Remake in Hindi, Tollywood, Bollywood , namashi chakraborty, Anthony D\'Souza, Rajkumar Santoshi, Amrin Qureshi - Telugu Allu Arjun, Amrin Qureshi, Anthony D\\'souza, Bollywood, Julayi, Namashi Chakraborty, Rajkumar Santoshi, Tollywood

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కెరియర్ లో చేసిన ప్రతి సినిమా కూడా దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది.కమర్షియల్ సినిమాలు చేసిన సినిమాకి, సినిమాకి కంటెంట్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు.

TeluguStop.com - Allu Arjun Julayi And Race Gurram Movie Remake In Hindi

అందుకే టాలీవుడ్ లో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఆయన కెరియర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన మొదటి సినిమా జులాయి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా కూడా అంతకుమించి సూపర్ హిట్ అయ్యింది.ఈ రెండు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.

TeluguStop.com - హిందీలో రీమేక్ అవుతున్న అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలలో హీరో, హీరోయిన్లు ఒక్కరే చేస్తూ ఉండటం‌
డైరెక్టర్‌ ఆంటోనీ డిసౌజ దర్శకత్వంలో జులాయి సినిమా రీమేక్ అవుతుంది.బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి త‌న‌యుడు న‌మ‌షి చ‌క్రవర్తి ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానుందని హిందీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ రేసుగుర్రం​ సినిమాలో కూడా న‌మ‌షి చ‌క్రవర్తి హీరోగా నటిస్తున్నాడు.

రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు బ్యాడ్‌బాయ్‌ టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది.

ఇక ఈ రెండు సినిమాల్లోనూ హైదరాబాద్‌ అమ్మాయి అమ్రిన్‌ ఖురేషి హీరోయిన్‌ నటిస్తుంది.మొత్తానికి అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాలు రెండింటిలో ఒక్కడే హీరోగా నటిస్తూ ఉండగా ఇద్దరు స్టార్ దర్శకులు ఈ రెండు సినిమాలు తెరకెక్కిస్తూ ఉండటం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

#Julayi #Allu Arjun #Anthony D'Souza #Amrin Qureshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Julayi And Race Gurram Movie Remake In Hindi Related Telugu News,Photos/Pics,Images..