బన్నీ ఆ జాబితాలో చేరినట్లేనా?  

Allu Arjun Join In Tollywood Star List-allu Arjun,allu Arjun Alavaikuntapuramlo,allu Arjun And Trivikram,allu Arjun Stylish Star

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే ఠక్కున వినిపించే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.ఇక ఇప్పుడు స్టార్ హీరోలు అంటే పవన్, మహేష్ బాబు, రాం చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ల పేర్లు వినిపించేవి.

Allu Arjun Join In Tollywood Star List-Allu Allu Alavaikuntapuramlo And Trivikram Stylish

ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు అల్లు అర్జున్ చాలా ప్రయత్నాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు.ఈయన చేస్తున్న సినిమాలో మెట్టు మెట్టు ఎక్కిస్తూ పైకి ఎదిగాడు.


ఇక తాజాగా సంక్రాంతికి విడుదల అయిన అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి.గతంలో అల్లు అర్జున్ ఎప్పుడు సాదించని వసూళ్లను రాబడుతోంది.

సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ సినిమాతో బన్నీ స్టార్ హీరోల జాబితాలో జాయిన్ అయినట్లే అంటూ సినీ వర్గాలు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ ఫ్యాన్స్ అల వైకుంఠపురంలో సినిమా ఫలితంపై చాలా సంతోషంగా ఉన్నారు.ప్రతి సీన్ కూడా అదిరిపోయిందని, ప్రతి పాట కూడా బన్నీ చింపేశాడు అంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ను అందించడం తో పాటు ప్రతి ప్రేక్షకుడికి కూడా ఆనందాన్ని అందిస్తుంది.

అందుకే ఈ సినిమా కలెక్షన్స్ నూరు కోట్లు దాటాయి.ఇప్పుడు బన్నీ ఆ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు అంటూ ఫ్యాన్స్ బలంగా చెబుతున్నారు.

తాజా వార్తలు