బాలయ్య అన్ స్టాపబుల్ 4వ ఎపిసోడ్‌ గెస్ట్‌ ఎవరంటే..!

Allu Arjun Is The Balakrishna Aha Ott Unstoppable Talk Show

ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్స్టాపబుల్లో నేడు మూడవ గెస్ట్‌ గా బ్రహ్మానందం సందడి చేయబోతున్నాడు.ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు అనీల్‌ రావిపూడి కూడా ఈ టాక్ షో లో హడావుడి చేయబోతున్నాడు.

 Allu Arjun Is The Balakrishna Aha Ott Unstoppable Talk Show-TeluguStop.com

బాలకృష్ణ మరియు బ్రహ్మానందం ల ఎపిసోడ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాలకృష్ణ చేయికి ఉన్న కట్టు తోనే బ్రహ్మానందంతో సందడి చేశాడు.

మూడు వారాల గ్యాప్ తర్వాత రాబోతున్న అన్స్టాపబుల్‌ మరో సారి భారీ వ్యూస్ ను దక్కించుకుంటుందని అంటున్నారు.మొదటి ఎపిసోడ్‌ లో మోహన్‌ బాబును రెండవ ఎపిసోడ్‌ లో నానిని మూడవ ఎపిసోడ్‌ లో బ్రహ్మానందం మరియు అనీల్‌ రావిపూడి ని తీసుకు వచ్చిన బాలయ్య నాల్గవ ఎపిసోడ్‌ లో ఎవరిని తీసుకు వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

 Allu Arjun Is The Balakrishna Aha Ott Unstoppable Talk Show-బాలయ్య అన్ స్టాపబుల్ 4వ ఎపిసోడ్‌ గెస్ట్‌ ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Aha Ott, Allu Arjun, Balakrishna, Unstoppble-Movie

బాలయ్య నాల్గవ ఎపిసోడ్‌ ఖచ్చితంగా ఒక స్టార్‌ హీరోతో అంటూ ఆహా టీమ్‌ అనధికారికంగా చెబుతున్నారు.ఆ స్టార్‌ ఎవరు అనేది మాత్రం వారు అధికారికంగా చెప్పక పోయినా మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.బాలకృష్ణ నాల్గవ ఎపిసోడ్‌ లో ఖచ్చితంగా అల్లు అర్జున్‌ కనిపించబోతున్నాడు అంటున్నారు.పుష్ప సినిమా ప్రమోషన్ కలిసి రావడంతో పాటు అన్ని విధాలుగా ఆహా కు కూడా ఉపయోగ దాయకం అంటున్నారు.

తన తండ్రి అల్లు అరవింద్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహా కోసం బన్నీ ఈమాత్రం హెల్ప్‌ అవ్వడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాకుండా పుష్ప సినిమా ప్రమోషన్‌ కూడా అన్స్టాపబుల్ ఉపయోగదాయకం అంటున్నారు.

అలా బాలకృష్ణ మరియు అల్లు అర్జున్ ల టాక్ షో రావడం ఖాయం అంటున్నారు.ఇటీవల అఖండ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో అల్లు అర్జున్ కనిపించాడు.

కనుక అన్స్టాపబుల్‌ లో కూడా కనిపించే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాల్గవ ఎపిసోడ్‌ కాకుంటే అయిదవ ఎపిసోడ్‌ అయినా ఖచ్చితంగా బన్నీ ఎపిసోడ్‌ ఉంటుందని అంటున్నారు.

#Aha OTT #Unstoppble #Allu Arjun #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube