స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టం అంటున్న స్టార్ విమెన్ క్రికెటర్  

Allu Arjun is my favourite, says cricketer Priya Punia, Indian Cricket, Tollywood, South Star Heroes, Women Cricket, Bunny - Telugu Allu Arjun, Bunny, Indian Cricket, Priya Punia, South Star Heroes, Tollywood, Women Cricket

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది.కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా అతని సినిమాలు విపరీతంగా చూసేవారు.

TeluguStop.com - Allu Arjun Is My Favourite Says Cricketer Priya Punia

అతని బాడీ లాంగ్వేజ్ ని ఫాలో అయ్యేవారు ఉంటారు.అలాగే అతని డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా ఫాలో అవుతారు.

మలయాళంలో అల్లు అర్జున్ కి అయితే ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి.అతని సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే పెద్ద కటౌట్స్ పెట్టేస్తారు.

TeluguStop.com - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టం అంటున్న స్టార్ విమెన్ క్రికెటర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక డబ్బింగ్ సినిమాలతో బన్నీ బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా ఇప్పటికే చేరువ అయ్యాడు.హిందీలో యుట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువగా ఆదరణ లభించే సినిమాలు అల్లు అర్జున్ వే కావడం విశేషం.

ఈ నేపధ్యంలో నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ అంటే తెలియని వారు ఉండరు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి స్పోర్ట్స్ స్టార్స్ లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాములో రాములా సాంగ్ లో బన్నీ స్టెప్స్ అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు కూడా చేశారు.ఇదిలా ఉంటే ఇండియన్ విమెన్ క్రికెట్ లో గతేడాది టీమిండియా మహిళా జట్టుకు ఎంపికై, కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి ప్రియా పునియా.

జైపూర్ కు చెందిన 24 ఏళ్ల ప్రియా ప్రధానంగా బ్యాట్స్ ఉమన్ ఇప్పటివరకు 5 వన్డేలు ఆడి 175 పరుగులు చేసింది.అత్యధిక స్కోరు 75 నాటౌట్.

అయితే, తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన మనోభావాలను పంచుకుంది.తనకు సౌతిండియా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది.

అతని సినిమాలు ఎక్కువగా చూస్తానని చెప్పుకొచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు బన్నీ అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తూ ఆమె డీటైల్స్ తెలుసుకునే పనిలో ఉన్నారు.

#Women Cricket #Priya Punia #Bunny #Indian Cricket #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Is My Favourite Says Cricketer Priya Punia Related Telugu News,Photos/Pics,Images..