త్రివిక్రమ్‌కు విసుగు తెప్పిస్తున్న బన్నీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తాజాగా ‘అరవింద సమేత’ చిత్రంతో ఎన్టీఆర్‌ కెరీర్‌ బెస్ట్‌ సక్సెస్‌ను ఇచ్చిన విషయం తెల్సిందే.త్రివిక్రమ్‌తో స్టార్‌ హీరోలు సినిమాలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు.

 Allu Arjun Irritates Trivikram Srinivas-TeluguStop.com

అయితే అల్లు అరవింద్‌తో త్రివిక్రమ్‌ మూడవ సినిమాకు సిద్దం అయ్యాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి.

అందుకే హ్యాట్రిక్‌ ఖాయం అనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ప్రారంభంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నారు.

ఒక బాలీవుడ్‌ సినిమాను రీమేక్‌ చేయాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నాడు.ఆ చిత్రం మూల కథను తీసుకుని దాన్ని తన స్టైల్‌లో త్రివిక్రమ్‌ మార్చాడు.అయితే అల్లు అర్జున్‌ అండ్‌ టీంకు ఆ మార్పులు చేర్పులు ఇష్టం లేదట.మార్పులు చేయకుండా ఆ హిందీ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా దించేయాలనేది అల్లు అర్జున్‌ డిమాండ్‌.

కాని త్రివిక్రమ్‌ మాత్రం అస్సలు అలా చేయను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.ప్రస్తుతం ఇద్దరి మద్య చర్యలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ముందుగా అనుకున్న ప్రకారం వీరి కాంబో మూవీ పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యి, డిసెంబర్‌లో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.కాని పరిస్థితి చూస్తుంటే సినిమా ఎప్పటికి ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి.త్వరలోనే సినిమా కథ ఫైనల్‌ చేస్తానంటూ త్రివిక్రమ్‌ చెబుతుంటే అల్లు అర్జున్‌ మాత్రం ఇంకా కథ ఫైనల్‌ కాలేదు, సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నాడు.అల్లు అర్జున్‌ తీరు త్రివిక్రమ్‌కు విసుగు తెప్పించే విధంగా ఉందని, ఇలా చేయడం వల్ల తన క్రియేటివిటీని అవమానిస్తున్నాడు అంటూ అల్లు అర్జున్‌పై త్రివిక్రమ్‌ ఆగ్రహంగా ఉన్నాడు.

మరి వీరి మద్య నెలకొన్న గందరగోళ పరిస్థితికి తెర పడేనా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube