ఆ పాత్రపై బన్నీ ఆసక్తిగా ఉన్నాడట

అల్లు అర్జున్‌ మొదటి సినిమా ఏదీ అంటే అంతా కూడా ఠక్కున గంగోత్రి అనేస్తారు.కాని అంతకు ముందే చిరంజీవి డాడీ చిత్రంలో అల్లు అర్జున్‌ చిన్న పాత్రలో కనిపించాడు.

 Allu Arjun Intrested In Mega 152 Movie With Chiranjeevi-TeluguStop.com

పెద్ద ఎత్తున సినిమాలు చేసినా కూడా మళ్లీ చిరంజీవితో సినిమా చేయలేక పోయాను అని అల్లు అర్జున్‌ బాధపడుతూ ఉన్నాడు.ఇప్పుడు అల్లు అర్జున్‌ మెగా 152 చిత్రంలో నటించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో ఒక కీలక పాత్రలో చరణ్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

Telugu Allu Arjun, Alluarjun, Chiranjeeviallu, Mahesh Babu, Ram Charan-Movie

చరణ్‌ ఆ పాత్రకు అయితే బాగుంటుందని అంతా అనుకున్నారట.కాని చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూట్‌తో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాలో నటింపజేయలేక పోతున్నట్లుగా కొరటాల శివ సన్నిహితులతో చెబుతున్నాడు.ఇదే సమయంలో ఆ పాత్రను మహేష్‌బాబుతో చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

చిరంజీవి సినిమాలో సూపర్‌ స్టార్‌ అంటూ పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Allu Arjun, Alluarjun, Chiranjeeviallu, Mahesh Babu, Ram Charan-Movie

ఈ సమయంలోనే దర్శకుడు కొరటాల శివను బన్నీ సంప్రదించాడట.ఆచార్య సినిమాకు తనను పరిశీలించాలంటూ కోరాడట.చిరంజీవి సినిమాలో నటించేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నాను అన్నాడట.

కాని కొరటాల మాత్రం మహేష్‌బాబును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.కొరటాల శివ సినిమా స్థాయిని అమాంతం పెంచేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube