బాలీవుడ్ లో ఎంట్రీ కోసం చూస్తున్న బన్నీ... కథ కోసం వెయిటింగ్  

Allu Arjun Interested Act In Bollywood Movie-allu Arjun,bunny,interested Act In Bollywood Movie,tollywood

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అల్లు అర్జున్.ప్రతి సినిమాకి క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం చూపిస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కమర్షియల్ గా నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టె హీరోగా టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఉన్నాడు.

Allu Arjun Interested Act In Bollywood Movie-Allu Bunny Interested Movie Tollywood

ప్రతి క్యారెక్టర్ కొత్తగా ట్రై చేసిన ప్రేక్షకులకి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో ఉండే విధంగా చూసుకుంటాడు.తాజాగా బన్నీ అల వైకుంఠపురంలో సినిమాలో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

తాజాగా ఓ నేషనల్ మీడియా చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ సందర్భంగా తన కోరికని బయటపెట్టాడు.

ఎప్పటి నుంచో తనకి ఒక హిందీ సినిమా చేయాలని ఉందని, అయితే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.అయితే కచ్చితంగా హిందీలో ఒక సినిమా చేస్తానని స్పష్టం చేశారు.

తన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి యుట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతూ ఉంటాయని, ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో సినిమా చేయాలని నార్త్ ఇండియా ఫాన్స్ నుంచి కూడా తనకి ఆహ్వానం అందుతుందని తెలిపారు.యుట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ఉన్న డబ్బింగ్ సినిమాల జాబితాలో అల్లు అర్జున్ టాప్ లో ఉన్న సంగతి.

మంచి కథ సెట్ అయితే కచ్చితంగా భవిష్యత్తులో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తానని చెప్పారు.అల్లు అర్జున్ తండ్రి ఇప్పటికే బాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యాడు.

ఈ నేపధ్యంలో కొడుకుని బాలీవుడ్ కి పరిచయం చేసే బాద్యతనని అతనే తీసుకుంటాడని టాక్ వినిపిస్తుంది.దీనికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు

Allu Arjun Interested Act In Bollywood Movie-allu Arjun,bunny,interested Act In Bollywood Movie,tollywood Related....