ఐకాన్ అటకెక్కినట్టేనా..!

Allu Arjun Icon Postponed Or Cancel

అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశారు.ఈ సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా మూవీ మాత్రం సెట్స్ మీదకు వెళ్లట్లేదు.

 Allu Arjun Icon Postponed Or Cancel-TeluguStop.com

వకీల్ సాబ్ హిట్ తో వేణు శ్రీరాం మీద కాన్ ఫిడెన్స్ వచ్చినా సరే అల్లు అర్జున్ మాత్రం ఇంకా వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న బన్నీ ఆ సినిమా రెండు పార్టుల కోసం 2022 కూడా మొత్తం రాసిచ్చేయాల్సిందే.

 Allu Arjun Icon Postponed Or Cancel-ఐకాన్ అటకెక్కినట్టేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఈ డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.మొదటి పార్ట్ కు సంబందించిన అప్డేట్స్ క్రేజీగా మారుతుండగా పుష్ప పార్ట్ 2 తర్వాతనే అల్లు అర్జున్ మరో సినిమా చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

మరోపక్క బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.అందుకే వేణు శ్రీరాం తో అనుకున్న ఐకాన్ దాదాపు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది.అయితే ఐకాన్ కథకు అల్లు అర్జున్ మాత్రమే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు వేణు శ్రీరాం.ఒకవేళ వేరే బిగ్ ఆఫర్ వస్తే మాత్రం చెప్పడం కష్టం.

#Icon #Venu Sriram #Sukumar #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube