అల్లు అర్జున్‌ 'ఐకాన్‌' సినిమాపై పుకార్లు  

Allu Arjun Icon Movie Trolls In Social Media-allu Arjun,allu Arjuna Movie With Trivikram,sukumar Direction,venu Sri Ram Director

గత ఏడాది ‘నా పేరు సూర్య’ చిత్రం నిరాశ పర్చడంతో ఏకంగా సంవత్సరం గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాలను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.ఇప్పటికే త్రివిక్రమ్‌ మూవీని చేస్తున్నాడు.అల వైకుంఠపురంలో అనే చిత్రంను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ చేస్తున్నాడు.ఆ వెంటనే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ అనే చిత్రంలో నటించాల్సి ఉంది.ఆ రెండు చిత్రాలతో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో కూడా ఒక చిత్రంకు సన్నాహాలు జరిగాయి.

Allu Arjun Icon Movie Trolls In Social Media-allu Arjun,allu Arjuna Movie With Trivikram,sukumar Direction,venu Sri Ram Director-Allu Arjun Icon Movie Trolls In Social Media-Allu Allu Arjuna With Trivikram Sukumar Direction Venu Sri Ram Director

Allu Arjun Icon Movie Trolls In Social Media-allu Arjun,allu Arjuna Movie With Trivikram,sukumar Direction,venu Sri Ram Director-Allu Arjun Icon Movie Trolls In Social Media-Allu Allu Arjuna With Trivikram Sukumar Direction Venu Sri Ram Director

త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్న సమయంలోనే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాలని బన్నీ అనుకున్నాడు.సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో ఐకాన్‌ సినిమా పట్టాలెక్కడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

కాని అనూహ్యంగా ఆ చిత్రం గురించిన ఊసే ఇప్పటి వరకు లేదు.దిల్‌రాజు ఆ చిత్రంను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు.కాని బడ్జెట్‌ కారణమో లేక మరేంటో కాని షూటింగ్‌ అనుకున్న సమయంకు ప్రారంభం అవ్వడం లేదు.అసలు మొదలు అయ్యేనా లేదో కూడా తెలియడం లేదు.

మరో రెండు నెలల్లో సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టేందుకు బన్నీ సిద్దం అవుతున్నాడు.అల వైకుంఠపురంలో సినిమాను పూర్తి చేసిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ చిత్రం చేయబోతున్నాడు.

ఆ తర్వాత ఏమైనా ఐకాన్‌ ఉంటుందో చూడాలి.ఐకాన్‌ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వాలంటూ బన్నీ డిమాండ్‌ చేసిన కారణంగానే దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మరి అసలు విషయం ఏంటీ, ఐకాన్‌ పరిస్థితి ఏంటీ అనేది బన్నీ అలవైకుంఠపురం చిత్రం విడుదల సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.