ఐకాన్‌ సైడ్‌ అవ్వలేదు.. ఇదే సాక్ష్యం అంటున్న బన్నీ ఫ్యాన్స్‌

అల్లు అర్జున్‌ పుష్ప పార్ట్ 1 షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో పుష్ప గుమ్మడి కాయ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

 Allu Arjun Icon Movie Pre Production Work In Progress,latest Tollywood News-TeluguStop.com

పుష్ప 2 షూటింగ్‌ కు అయిదు నుండి ఆరు నెలల సమయం ఉంటుంది.ఈ గ్యాప్‌ లో అల్లు అర్జున్‌ ఐకాన్‌ సినిమాను చేస్తాడని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

కాని చాలా మంది పుష్ప వంటి బిగ్గెస్ట్ మూవీ రెండు పార్ట్‌ లుగా అన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్‌ ఉంటుంది.కాని మద్యలో మరో సినిమా చేయడం ఏంటీ అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి.

బాహుబలి సినిమా ను రెండు పార్ట్‌ లుగా చేసిన సమయంలో ప్రభాస్ రెండవ పార్ట్‌ కు మద్యలో సినిమా చేయలేదు.ఇక కేజీఎఫ్ సినిమాను చేస్తున్న సమయంలో కూడా యశ్‌ రెండవ పార్ట్‌ కు ముందు మరే సినిమాను చేయలేదు.

ఇప్పుడు పుష్ప రెండవ పార్ట్ కు ముందు ఎలా ఐకాన్‌ స్టార్‌ మరో సినిమాను చేస్తాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

Telugu Allu Arjun, Icon, Telugu, Pushpa, Venu Sriram-Movie

తాజాగా అల్లు అర్జున్ మేకర్స్ నుండి క్లారిటీ వచ్చింది.ఐకాన్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది.సినిమా సెట్టింగ్‌ లను మొదలుకుని సాంకేతిక నిపుణులు మరియు ఇతర నటీ నటులకు సంబంధించిన ఎంపిక జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాలో బన్నీ పాత్రకు సంబంధించిన డైలాగ్‌ వర్షన్‌ పూర్తి అయ్యింది.దానికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.సినిమాను విడుదల చేయకుండానే ఐకాన్‌ సినిమా పట్టాలెక్కి సంగం వరకు షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే అంటే కరోనా థర్డ్ వేవ్‌ లేకుండా షూటింగ్‌ లు సాఫీగా సాగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube