అందరినీ అవాక్కు చేసి బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు(ఏప్రిల్ 8న) పుట్టిన రోజు జరుపుకుంటుండటంతో ఆయన తాజా చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇవాళ రిలీజ్ చేశారు.

 Allu Arjun Surprises Everyone With Icon Allu Arjun, Icon, Aa21, Pushpa-TeluguStop.com

ఈ సినిమాకు ఎవ్వరూ ఊహించని విధంగా పుష్ప అనే లేడీ ఓరియెంటెడ్ టైటిల్‌ను పెట్టడం విశేషం అని చెప్పాలి.

ఇక ఈ సినిమా స్టార్ట్ కాకముందే బన్నీ మరో కొత్త సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమాకు ఐకాన్ అనే పేరును కూడా పెట్టి టైటిల్ పోస్టర్‌ను గతంలోనే రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమా అప్పట్లోనే అటకెక్కిందని చిత్ర వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.

దీంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు.

అయితే తాజాగా ఐకాన్ చిత్ర యూనిట్ బన్నీకి బర్త్‌డే విషెస్ తెలపడంతో ఈ సినిమా ఇంకా బతికే ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నాడని, ఆ సినిమా అయిపోయాక బన్నీ సినిమాను మొదలుపెడతాడని దిల్ రాజు తెలిపాడు.దీంతో ఐకాన్ చిత్రం లైన్‌లోనే ఉందని బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube