బోజ్‌పూరి భాషలో అక్కడి స్టార్స్‌ కు సైతం సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డును దక్కించుకున్న మెగా హీరో

అల్లు అర్జున్ కు కేరళలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బన్నీ నటించిన కొన్ని సినిమాలు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్ సినిమా రేంజ్‌ లో వసూళ్లు చేసింది.

 Allu Arjun Harish Shankar Dj Movie Record Rating In Bhojpuri, Allu Arjun, Bojpur-TeluguStop.com

ఒకటి రెండు సందర్బాల్లో బన్నీ సినిమా అంతకు మించి అన్నట్లుగా కేరళలో కుమ్మేసింది.భారీ వసూళ్లు నమోదు చేసిన అల్లు అర్జున్‌ గత సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఒక బన్నీ సినిమా ఒక భాషలో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకుంది.

సౌత్‌ ఇండియన్ హీరోలకే కాదు ఆ భాష హీరోలకు ఎవరికి కూడా అంత భారీ రేటింగ్‌ సాధ్యం కాలేదు.బన్నీ నటించిన డీజే సినిమా బోజ్ పూరిలో కుమ్మేసింది.

రికార్డు బ్రేకింగ్‌ టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుని అక్కడి వారికి ఆశ్చర్యం ను కలిగించింది.బోజ్‌ పూరిలో ఈ సినిమా ఇటీవలే డబ్బింగ్ అయ్యింది.

బోజ్ పూరి కి చెందిన డించాక్ అనే టీవీ ఛానెల్‌ లో భారీ గా వీక్షణలు దక్కించుకుంది.

కేవలం టీవీల్లో మాత్రమే కాకుండా యూట్యూబ్‌ లో కూడా ఉత్తరాది ప్రేక్షకులు డీజే సినిమాను తెగ చూస్తున్నారు.

ఇంతటి భారీ వ్యూస్ వస్తున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం యావరేజ్ గానే వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో బన్నీ కి జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం సినిమా యూట్యూబ్‌ లో ఇంకా ట్రెండ్‌ అవుతుందని అంటున్నారు.ఇంతగా బోజ్ పూరిలో ఈ సినిమా వ్యూస్ ను దక్కించుకోవడం కు కారణం ఏంటీ అంటూ విశ్లేషకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు.

దీంతో బన్నీ గత సినిమా లను కూడా బ్యాక్ టు బ్యాక్‌ అక్కడ శాటిలైట్‌ లో టెలికాస్ట్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube