నాగబాబుకు హ్యాండ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌... లెటర్‌తోనే సరిపెట్టాడు  

Allu Arjun Gives Hand To Nagababu For Ap Elections-

జనసేన పార్టీ తరపున నాగబాబు నరసాపురం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. అన్న నాగబాబు గెలుపు కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన అన్నను గెలిపించుకోలేక పోయాడు అంటూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పవన్‌ కళ్యాణ్‌ అన్న కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడంతో పాటు, పార్టీ శ్రేణులను ఉత్తేజ పర్చుతూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే..

నాగబాబుకు హ్యాండ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌... లెటర్‌తోనే సరిపెట్టాడు-Allu Arjun Gives Hand To Nagababu For AP Elections

ఇక తాజాగా నాగబాబు భార్య ఇటీవల స్థానికంగా ప్రచారం చేస్తూ తమ కొడుకు వరుణ్‌ బాబు మరియు అల్లు అర్జున్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అంటూ ప్రకటించింది.

ఆమె చెప్పినట్లుగా వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారంలో నిన్నటి నుండి పాల్గొంటున్నాడు. అయితే నాగబాబు ప్రచారంకు అల్లు అర్జున్‌ రావడం లేదని తేలిపోయింది. మొన్నటి వరకు వస్తానంటూ చెప్పిన అల్లు అర్జున్‌ ఇప్పుడు మాత్రం ఏవో కారణాలు చెబుతూ ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు.

మీరు ఏపీలో రాజకీయ అరంగేట్రం చేసి, తప్పకుండా రాష్ట్రం అభివృద్దికి తోడ్పాటు అందిస్తారని నమ్మకం ఉందని లేఖలో పేర్కొన్నాడు..

అల్లు అర్జున్‌ ప్రచారంకు వస్తాడని చూసిన జనసేన పార్టీ కార్యకర్తలకు ఇది మింగుడు పడటం లేదు. అయితే అల్లు అర్జున్‌ బిజీగా ఉన్న కారణంగా రాలేక పోతున్నాడు అంటూ కొందరు అంటున్నారు. జనసేన గెలుపు మరియు పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం కూడా ఆయన తన లేఖలో కోరుకుంటున్నట్లుగా పేర్కొనడంతో మేము అంతా మీ వెంట ఉన్నట్లుగా చెప్పాడు.

నాగబాబుకు అల్లు అర్జున్‌ మద్దతు ఉన్న నేపథ్యంలో నరసాపురంలో ఏ మేరకు ఫలితం ఉంటుంది అనేది చూడాలి.