టాలీవుడ్ దర్శకులకి గ్రాండ్ పార్టీ ఇచ్చిన బన్నీ

టాలీవుడ్ లో డైరెక్టర్స్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అల్లు అర్జున్.తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బన్నీ ఇప్పుడు అదే స్పీడ్ తో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.

 Allu Arjun Gives Grand Party To Tollywood Directors-TeluguStop.com

ఇదిలా ఉంటే అల సినిమా నిర్మాతగా ఉన్న తన తండ్రికి కూడా భారీగా లాభాలు తీసుకొచ్చాయి.ఇక బన్నీ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచిపోయింది.

ఈ నేపధ్యంలో బన్నీ టాలీవుడ్ లో దర్శకులకోసం ఒక అదిరిపోయే పార్టీ ఇచ్చారు.దీనికి సంబంధించిన ఫోటో అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో పెట్టారు.

ఈ పార్టీలో దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి స్టార్ దర్శకులు, యువ దర్శకుడులు, త్వరలో దర్శకులుగా మారబోయే అసోసియేట్, కో డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ పార్టీ చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తుంది.

ఇక ఈ పార్టీ ద్వారా దర్శకులతో మాట్లాడి తనకి అదిరిపోయే కథలు సిద్ధం చేసుకోవాలని పరోక్షంగా హిట్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.అయితే ఒక దర్శకుడు ట్రాక్ రికార్డ్ చూసి సినిమాలు ఒకే చేసే అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్ దర్శకులు అందరికి పార్టీ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఇంకా ఏమైనా ఉందా అనే ప్రశ్న కూడా టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube