పుష్పరాజ్ కు స్వీటెస్ట్ వెల్కమ్ చెప్పిన అర్హ.. పిక్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.

 Allu Arjun Gets The 'sweetest Welcome' From Daughter Arha, Allu Arjun, Sweetest Welcome, Daughter Arha-TeluguStop.com

ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.

ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది.

 Allu Arjun Gets The 'sweetest Welcome' From Daughter Arha, Allu Arjun, Sweetest Welcome, Daughter Arha-పుష్పరాజ్ కు స్వీటెస్ట్ వెల్కమ్ చెప్పిన అర్హ.. పిక్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా హిందీ మార్కెట్ లో అందుకున్న విజయం బన్నీ కెరీర్ ను టాప్ లో నిలబెట్టింది.

ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా హిందీ మార్కెట్ లో హవా చూపించింది.గత ఏడాది డిసెంబర్ 17న విడుదల అయిన ఈ సినిమా వసూళ్ల పరంగానే కాకుండా సినిమా పరంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది.

క్రికెటర్ల దగ్గర నుండి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరు బన్నీ హుక్ స్టెప్పులతో హల్ చల్ చేస్తూనే ఉన్నారు.

విడుదల అయ్యి నెల రోజులు అవుతున్న ఇంకా అదే హవా నడుస్తుంది.

నార్త్ లో ఏకంగా 96 కోట్ల 75 లక్షల రూపాయలను వసూళ్లు చేసి ఇప్పుడు 100 కోట్ల మార్క్ ను టచ్ చేసే దిశగా ముందుకు వెళుతుంది.ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో సుకుమార్, బన్నీ చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు.

దీంతో సెలెబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లిన బన్నీ అక్కడి నుండి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చాడు.

అల్లు అర్జున్ దాదాపు 16 రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి రావడంతో ఆయన ముద్దుల కూతురు అల్లు అర్హ అతడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.ఆకులు, పూల రెక్కలతో వెల్కమ్ నాన్న అని రాసి బన్నీకి ఆహ్వానం పలకడంతో ఆ మూమెంట్ ను బన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన అర్హ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/CZTRVg2vd4S/

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube