సినిమావాళ్ళ సెంటిమెంటు పైత్యం అదోరకం.మనకి సిల్లీగా అనిపిస్తాయి కాని వాళ్ళు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు.
ఇక మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అదోరకం సెంటిమెంట్ అలవాటైంది.వింటే ఇదేం పిచ్చి అని మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు.
మనమెలాగో మామూలు ప్లాస్టిక్ కుర్చీల్లోనే కూర్చుంటాం.మరి అల్లు అర్జున్ లాంటి స్టార్ కూడా ప్లాస్టిక్ కుర్చిలోనే కూర్చుంటే ఎంత వింతగా ఉంటది.
అదీగాక నేను అదే కుర్చీలో కూర్చుంటాను అంటే.
అల్లు అర్జున్ దగ్గర ఒక ప్లాస్టిక్ కుర్చీ ఉందట.
అది బన్నికి సెంటిమెంటు కుర్చి.ఏ షూటింగ్ కి వెళ్ళినా, తనతోపాటు ఆ కుర్చి కూడా ప్రయాణం చేయాల్సిందే.
మీరు ఎంత ఖరీదైన కుర్చిలో కూర్చోమన్నా బన్ని కూర్చోడు.
ఇటివలే సరైనోడు రషెష్ చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్ కి వెళ్ళాడు బన్ని.
యూనిట్ అంతా ల్యాబ్ లో కుర్చిల్లో కూర్చుంటే బన్ని మాత్రం తన ప్లాస్టిక్ కుర్చి తెచ్చుకోని కుర్చున్నాడట.చిత్రవిచిత్రమైన సెంటిమంట్ కదా.