నిన్నటి వరకు తిట్టిన వాళ్లు ఇప్పుడు మైత్రిని పొగిడేస్తున్నారు

కొన్ని నెలల క్రితం ప్రభాస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో యూవీ క్రియేషన్స్‌ పై బ్యాడ్‌ కామెంట్స్‌ చేస్తూ బ్యాడ్‌ ట్రెండ్‌ చేసిన విషయం తెల్సిందే.రాధే శ్యామ్ సినిమా అప్‌ డేట్‌ ఇవ్వడం లేదు అంటూ యూవీ క్రియేషన్స్‌ ను బాయ్‌ కాట్‌ చేయాలంటూ ట్రెండ్‌ చేశారు.

 Allu Arjun Fans Full Happy About Mythri Movie Makers , Allu Arjun Pushpa Movie, Pushpa, Breaking News, Telugu Film News, Pushpa Movie Update, Pushpa Movie Event, Prabhas Fans, Allu Arjun Fans, Sukumar, Mythri Movie Makers, Rashmika Mandana-TeluguStop.com

ఆ దెబ్బతో యూవీ క్రియేషన్స్‌ వారు ప్రభాస్‌ మూవీ రాధేశ్యామ్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చేశారు.ప్రభాస్‌ అభిమానుల తర్వాత అల్లు అర్జున్‌ అభిమానులు కూడా ఈ ట్రెండింగ్‌ను మొదలు పెట్టారు.

అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప సినిమా నుండి అప్‌ డేట్‌ ఇవ్వడం లేదు అంటూ ఇటీవల మైత్రి మైవీ మేకర్స్‌ పై ట్రోల్స్‌ చేశారు.సోషల్‌ మీడియాలో పుష్ప ఎక్కడ అంటూ మైత్రి వారిని ట్యాగ్‌ చేసి బ్యాడ్‌ కామెంట్స్‌ పెట్టిన వారు చాలా మంది అయ్యారు.

 Allu Arjun Fans Full Happy About Mythri Movie Makers , Allu Arjun Pushpa Movie, Pushpa, Breaking News, Telugu Film News, Pushpa Movie Update, Pushpa Movie Event, Prabhas Fans, Allu Arjun Fans, Sukumar, Mythri Movie Makers, Rashmika Mandana-నిన్నటి వరకు తిట్టిన వాళ్లు ఇప్పుడు మైత్రిని పొగిడేస్తున్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వారిని బ్లాక్‌ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.

పుష్ప సినిమా నుండి ఎట్టకేలకు అప్‌ డేట్‌ వస్తోంది.

కేవలం అప్‌ డేట్‌ మాత్రమే కాకుండా ఏకంగా ఒక ఈవెంట్‌ ను నిర్వహించేందుకు సిద్దం అయ్యారు.మైత్రి మూవీ మేకర్స్‌ వారి నుండి చిన్న అప్‌ డేట్‌ అడిగితే వారు ఏకంగా సినిమా ఈవెంట్‌ ను నిర్వహించేందుకు ముందుకు రావడం పట్ల అల్లు అర్జున్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు రేపు జరుగబోతున్న ఈవెంట్‌ లో పాల్గొంటారని తెలుస్తోంది.అల్లు అర్జున్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నారు.

నిన్న మొన్నటి వరకు మైత్రి వారిని తిట్టిన అభిమానులు ఇప్పుడు పొగుడుకుంటూ ఈవెంట్‌ కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.పుష్ప సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ను పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube