అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా అంతా కూడా చాలా పాజిటివ్ బజ్‌తో ఉంది.అయితే సినిమాకు సంబంధించిన ఒక విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నీయాంశం అవుతూ మెగా అభిమానులను టెన్షన్‌కు గురి చేస్తుంది.ఆ విషయం ఏంటీ అంటే అల్లు అర్జున్ గత సినిమా ఫలితం తారు మారు అయ్యింది.
ఇలాంటి సమయంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌తో సినిమాలు చేయాలి.
కాని అల వైకుంఠపురంలో సినిమాలో మాత్రం హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది.ఈమె ఇప్పటి వరకు కనీసం ఒక్క మంచి సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది.త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేసిన అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా పూజా హెగ్డే పాత్రకు నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.ఆ సినిమాకు పూజా వల్ల కలిగిన లాభం ఏమీ లేదు అంటూ చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌తో జోడీగా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు బన్నీకి జోడీగా నటించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డేల కాంబోలో గతంలో డీజే వచ్చింది.ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
యావరేజ్‌గానే మిగిలింది.ఇంతగా బ్యాడ్ సెంటిమెంట్ ఉన్న పూజా హెగ్డేతో మళ్లీ బన్నీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.అల్లు అర్జున్‌కు పూజా హెగ్డే వల్ల అల వైకుంఠపురంలో సినిమా ఫ్లాప్‌ను తెచ్చి పెడుతుందేమో అంటూ బన్నీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.