అప్పుడే సమయం కాదంటున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌

బాహుబలి సినిమా తర్వాత ఎంతో మంది టాలీవుడ్‌ స్టార్స్ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.బాలీవుడ్‌ లో సినిమాలు చేయడంతో పాటు తమ సినిమా లను బాలీవుడ్‌ కు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Allu Arjun Fans Dont Want Bollywood Entry-TeluguStop.com

ఈ సమయంలోనే పలువురు టాలీవుడ్‌ స్టార్స్ బాలీవుడ్‌ లో తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల ప్రభాస్‌ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా కూడా ఆదిపురుష్ తో మరో కొత్త బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇక మరి కొందరు స్టార్‌ హీరోలు మరియు కొందరు దర్శకులు కూడా బాలీవుడ్‌ కు వెళ్లబోతున్నారు.ఈ సమయంలోనే స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ కూడా బాలీవుడ్‌ లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Allu Arjun Fans Dont Want Bollywood Entry-అప్పుడే సమయం కాదంటున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్‌ తెలుగు సినిమాలు చాలా వరకు హిందీ లో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఓటీటీ తో పాటు శాటిలైట్ మరియు యూట్యూబ్‌ ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప సినిమా ను నేరుగా హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుక సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.సుకుమార్ తో పుష్ప తర్వాత బాలీవుడ్‌ డైరెక్టర్ తో బన్నీ సినిమా ఉంటుందని అంటున్నారు.

హిందీ మరియు తెలుగు భాషల్లో ఈ సినిమా ను తెరకెక్కించి భారీ మొత్తంలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మలయాళంలో సినిమాను చేయాలనుకున్న బన్నీ మొదట హిందీ లో సినిమా చేయాలని నిర్ణయానికి వచ్చారు.బన్నీ అప్పుడే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంపై ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడే బాలీవుడ్‌ కు వద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు.

#Pan India #Pushpa #Bunny Fans #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు