అల్లు అర్జున్‌ డబుల్‌ రోల్‌... ఇది మరీ ఓవర్‌ గురూ  

Allu Arjun Dual Role In Trivikram Movie-direction,dual Role,movie Updates,trivikram,venu Sriram

  • అల్లు అర్జున్‌ త్వరలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన 19వ సినిమాను చేయబోతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగిన బన్నీ 19వ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. ఇక సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక బన్నీ 20 వ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. సుకుమార్‌తో మూవీ అంటే కనీసం సంవత్సరం అయినా పడుతుంది.

  • అల్లు అర్జున్‌ డబుల్‌ రోల్‌... ఇది మరీ ఓవర్‌ గురూ-Allu Arjun Dual Role In Trivikram Movie

  • బన్నీ ఈ రెండు సినిమాలు పూర్తి చేయాలంటే కనీసం సంవత్సరం నర సమయం పడుతుంది. అంటే 2020 చివరి వరకు ఈ రెండు సినిమాలు ఉంటాయి.

    ఆ తర్వాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండబోతుంది.

  • బన్నీ నటించబోతున్న 21వ సినిమాకు సంబంధించి అప్పుడే టైటిల్‌ కూడా రిజిస్ట్రర్‌ అయ్యింది. ‘ఐకాన్‌’ అంటూ కనిపించడం లేదు అనే సబ్‌ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంను దిల్‌ రాజు నిర్మించబోతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటి నుండే చెబుతున్నారు.

  • Allu Arjun Dual Role In Trivikram Movie-Direction Dual Movie Updates Trivikram Venu Sriram

    ఐకాన్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా కథ ఏంటో తెలియదు, ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు కాని, అప్పుడే సినిమాలో బన్నీ డబుల్‌ రోల్‌ అని, కథ కాపీ అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఐకాన్‌ చిత్రం బన్నీ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విశ్లేషిస్తున్నారు.

  • మరి ఇలాంటి సమయంలో ఐకాన్‌ సినిమా కథ గురించిన చర్చలో నిజం ఎంతో, బన్నీ మొదటి సారి డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడా అనేది చూడాలి.