యూట్యూబ్‌లో వచ్చిన ‘డీజే’ ఇప్పుడు రీమేక్‌ ఏంటో?

అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ‘డీజే’ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే.బన్నీ కెరీర్‌ లో మొదటి బిగ్గెస్ట్‌ సక్సెస్‌ గా ఈ చిత్రం నిలిచింది అనడంలో సందేహం లేదు.

 Dil Raju To Remake Dj Movie In Hindi, Dj Movie Remake, Youtube Release, Allu Arj-TeluguStop.com

పూజా హెగ్డే అందాలతో పాటు ఈ చిత్రంలో కామెడీ ఇంకా కథ సినిమా సక్సెస్‌కు కారణం అయ్యాయి.ఈ సినిమాను హిందీలో డబ్‌ చేసి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో పాటు శాటిలైట్‌ ద్వారా కూడా ప్రసారం చేశారు.

అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బన్నీకి హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం డీజే.

ఈ చిత్రం అక్కడ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను దక్కించుకుంది.అలాగే శాటిలైట్‌లో ప్రసారం అయినప్పుడు మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది.

ఇప్పటికే పలు సార్లు సినిమా ప్రసారం అయ్యి చాలా మంది చూశారు.ఇలాంటి సమయంలో డీజే చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తానంటూ దిల్‌ రాజు ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

Telugu Allu Arjun, Dj, Harish Shankar, Youtube-

తెలుగు సినిమాలు ఇటీవల కాలంలో హిందీలో డబ్‌ అవ్వడం సూపర్‌ హిట్‌ అవ్వడం సర్వ సాదారణం అయ్యింది.ప్రస్తుతం జెర్సీ సినిమాతో హిందీలో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్న దిల్‌రాజు మరో వైపు డీజేను కూడా హిందీలో స్టార్‌ హీరోతో రీమేక్‌ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చి ఆ దిశగా చర్చలు జరుపుతున్నాడు.త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube