15 ఏళ్ల 'దేశముదురు'.. బన్నీ కేరీర్ టర్నింగ్ తిప్పిన ఈ సినిమా విశేషాలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజున టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు అంటే తన కేరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన హార్డ్ వర్క్ తో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు.అయితే ఈయన కేరీర్ కు బ్రేక్ పడిన సినిమా ఏది అంటే అది ఖచ్చితంగా దేశముదురు అనే చెప్పాలి.

 Allu Arjun Desamudhuru Completes 15 Years, 15 Years For Desa Muduru, Allu Arjun,-TeluguStop.com

పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన దేశముదురు సినిమా ఇప్పటికి అల్లు ఫ్యాన్స్ మర్చిపోలేరు.

అల్లు అర్జున్ కేరీర్ లో అత్యధిక కేంద్రాల్లో శత దినోత్సవం చుసిన సినిమాగాను, ఆయన నట జీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక  సినిమాగా దేశముదురు రికార్డ్ సాదించింది.

అప్పట్లో బన్నీ కి యూత్ లో అంతగా ఫాలోయింగ్ లేదు.అయితే దేశముదురు సినిమా తర్వాత మాస్ ప్రేక్షకులు మరింత దగ్గర అయ్యారు.

ఈ సినిమా 2007 జనవరి 12న విడుదల అయ్యి సంక్రాంతికి సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాను డివివి దానయ్య తమ యూనివర్సల్ మీడియా పతాకంపై భగవాన్ జె సమర్పణలో నిర్మించారు.

ఇక ఈ సినిమాలో హన్సిక మోత్వానీ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి వరుస అవకాశాలను అందుకుంది.

ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే పూరీ జగన్నాథ్ అందించగా చక్రి సంగీతం అందించారు.

ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి.అప్పట్లో 400 థియేటర్ లలో విడుదల అయినా బన్నీ తొలిసినిమా ఇదే.వందకు పైగా థియేటర్ లలో శత దినోత్సవం చుసిన ఈ సినిమా హైదరాబాద్ 70 ఎమ్ ఎమ్ లో నృగ రజతోత్సవం పూర్తి చేసుకుంది.అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా అత్యధిక రోజులు ప్రదర్శించిన సినిమాగా కూడా నిలిచింది.బన్నీ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించి యూత్ ను ఆకట్టుకున్నాడు.

అంతలా బన్నీ కేరీర్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మైలు రాయిగా నిలిచి పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube