అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే

అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.మహా అయితే మరో 10-12 రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Allu Arjun Dependent On Pawan Kalyan’s Decision-TeluguStop.com

మార్చి 15వ తేదికల్లా ఈ చిత్రం యొక్క ఫస్ట్ కాపి సిద్ధం అయిపోతుందట.

కావాలనుకుంటే మార్చి నెలాఖరు సమయానికి సినిమాని విడుదల చేసుకోవచ్చు.

కాని ఎప్రిల్ విడుదల బన్నికి అచ్చొచ్చింది.అందుకే పట్టుబట్టి మరీ ఏప్రిల్‌ లోనే వస్తానంటున్నాడు.

ఇక దొరకాల్సింది సరైన విడుదల తేదే.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ కన్ను ఇంకా ఏప్రిల్ 8వ తేది మీదే ఉందట.

పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆలస్యం చేసి సర్దార్ గబ్బర్ సింగ్ ని ఇంకాస్త ఆలస్యంగా తీసుకొస్తే బన్ని ఖచ్చితంగా ఏప్రిల్ 8నే వస్తాడు.కాని సర్దార్ చెప్పిన సమయానికే వస్తే ఏప్రిల్ 22వ తేదిని మరో ఆప్షన్ కింద పెట్టుకున్నాడు ఈ మెగాహీరో.

ఈ రకంగా బన్ని సినిమా రిలీజ్ డేట్ బన్ని చేతిలో లేకుండాపోయింది.అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube