పకడ్బందీగా వెళ్తున్న పుష్ప.. ఏ విషయంలో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్ మొదలుపెట్టుకుని తొలి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది.టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బన్నీ చేయబోయే పాత్ర చాలా మాస్ లుక్‌లో ఉండబోతుంది.

 Allu Arjun Dedication For Pushpa In Lockdown, Allu Arjun, Pushpa, Lockdown, Suku-TeluguStop.com

ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ లాక్‌డౌన్ వేళ బన్నీ పుష్ప సినిమాలోని తన పాత్ర కోసం చిత్తూరు యాసను పూర్తి డెడికేషన్‌తో నేర్చుకుంటున్నాడట.ఈ యాసలోని ప్రతి పదాన్ని ఎలా పలకాలనే అంశంపై బన్నీ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు యాసలో మాట్లాడే విషయంలో ఒక్క తప్పిదం కూడా దొర్లకుండా ఉండేందుకు బన్నీ పడుతున్న తాపత్రయం చిత్ర యూనిట్‌ను అవాక్కయ్యేలా చేస్తోందట.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్‌లో కనిపించే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

శేషాచలం అడవుల్లో మెజారిటీ శాతం షూటింగ్ జరగనుందని, ఫారిన్ లొకేషన్స్ అనే ఊసే ఈ సినిమాలో ఉండబోదని పుష్ప చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా రాక్‌స్టా్ర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube