భీష్మకు బంటు కంగ్రాట్స్‌

నితిన్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీష్మ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.సినిమా హిట్‌ అంటూ వసూళ్లను చూస్తుంటే అనిపిస్తుంది.

 Allu Arjun Congratulations To Nithin And Venky Kudumula-TeluguStop.com

ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ను దక్కించుకున్న ఈ చిత్రం నైజాం ఏరియాలో మంచి వసూళ్లతో కుమ్మేస్తుంది.ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ ఈ సినిమా గురించి ట్వీట్‌ చేయడంతో సినిమాకు మరింత బూస్ట్‌ ఇచ్చినట్లయ్యింది.

పెద్ద ఎత్తున సినిమా గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Telugu Allu Arjun, Alluarjun, Bheeshma, Nithin Bheeshma, Nithin-Movie

భీష్మ సక్సెస్‌ సందర్బంగా నితిన్‌కు కంగ్రాట్స్‌ తెలియజేసిన బన్నీ దర్శకుడు వెంకీ కుడుములకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు.సినిమా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉందంటూ ప్రశంసించాడు.హీరోయిన్‌ రష్మిక మందన్నతో పాటు నిర్మాత వంశీలకు కూడా బన్నీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Telugu Allu Arjun, Alluarjun, Bheeshma, Nithin Bheeshma, Nithin-Movie

మరో ట్వీట్‌లో బన్నీ నితిన్‌కు డబుల్‌ కంగ్రాట్స్‌ తెలియజేశాడు.సినిమా హిట్‌ అవ్వడంతో పాటు పెళ్లి చేసుకోబోతున్నందుకు గాను బన్నీ శుభాకాంక్షలు తెలియజేశాడు.ఇటీవలే అల వైకుంఠపురంలో చిత్రంతో హిట్‌ అందుకున్న బన్నీ తాజాగా విడుదలైన భీష్మ సక్సెస్‌ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇక బన్నీ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube