ఉప్పెనపై బన్నీ లేట్‌ రియాక్షన్‌ పై నెటిజన్స్‌ వింత కామెంట్స్‌

మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి ఉప్పెన ల సక్సెస్‌ ను దక్కించుకున్న వైష్ణవ్‌ తేజ్‌ కు టాలీవుడ్‌ ప్రముఖులు ఎప్పుడో అభినందనలు తెలియజేశారు.ఉప్పెన సినిమాపై వారి రియాక్షన్‌ తో సినిమా మరింతగా సక్సెస్‌ అవ్వడం తో పాటు భారీ వసూళ్లను నమోదు చేసుకుంది.

 Allu Arjun Comments On Uppena Movie And Team-TeluguStop.com

ఇక మెగా హీరోలు కూడా పలువురు వైష్ణవ్‌ సినిమా విడుదలైన వెంటనే స్పందించారు.కాని అల్లు అర్జున్‌ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించాడు.

ఆయన ఇప్పటి వరకు సినిమా చూడక పోయి ఉంటాడా అంటూ ఆమద్య సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.బన్నీ సినిమా ను చూడలేదట.

 Allu Arjun Comments On Uppena Movie And Team-ఉప్పెనపై బన్నీ లేట్‌ రియాక్షన్‌ పై నెటిజన్స్‌ వింత కామెంట్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే ప్రత్యేక షో వేయించుకుని చూశాడట. అల్లు అర్జున్‌ మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి ఉప్పెన చూశాడు.

సినిమా చూసిన తర్వాత దర్శకుడు బుచ్చి బాబు పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.ఈ విషయమై ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

ఉప్పెన సినిమా విడుదల అయ్యి నెల రోజులు దాటి పోయింది.ఇలాంటి సమయంలో బన్నీ సినిమా ను చూసి బాగుంది అంటూ కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.మొన్నటి వరకు షూటింగ్ లతో బిజీగా ఉన్న కారణంగా బన్నీకి ఉప్పెన చూసేందుకు సమయం కుదరలేదు అంటూ కొందరు అంటున్నారు.కాని ఆయన సినిమా చూడాలనుకుంటే కుదరని అంత బిజీగా ఏమీ లేడు అనేది కొందరి అభిప్రాయం.

నెటిజన్స్ చాలా మంది బన్నీ లేట్‌ గా ఉప్పెనపై స్పందించడంపై విమర్శలు కురిపిస్తున్నారు.బన్నీ ఎందుకు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ప్రమోషన్ కు కాస్త దూరంగా ఉన్నాడు అనేది పలువురికి ఉన్న అనుమానాలు.

ఆ అనుమానాల విషయం పక్కన పెడితే బన్నీ ఒక్క హీరో ప్రమోషన్‌ చేయనంత మాత్రాన సినిమా కు వచ్చిన నష్టం కాని ఆయన ప్రచారం వల్ల దక్కే లాభం కాని ఏమీ లేదు అంటూ ఉప్పెన సినిమా ను చూసి అభిమానించిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

#AlluArjun #Vaishnav Tej #Allu Arjun #AlluArjun #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు