నాన్న తీసుకున్న ‘కలర్ ఫోటో’కు బన్నీ ప్రశంసలు  

allu arjun comments on suhas and Chandini Chowdary color photo movie, Allu Arjun, Suhas, Chandini Chowdary, Color Photo Movie, , Color Photo Team, , Color Photo Movie Review, Allu Aravind - Telugu @actorsuhas, @harshachemudu, @ichandinic, @kaalabhairava7, @sairazesh, @sandeepraaaj

సుహాస్‌ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కిన కలర్‌ ఫొటో సినిమా ఇటీవలే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హృదయ కాలేయం మరియు కొబ్బరిమట్ట సినిమాలను అందించిన సాయి రాజేష్‌ ఈ సినిమాను నిర్మించాడు.

TeluguStop.com - Allu Arjun Comments On Suhas And Chandi Choudary Color Photo Movie

సందీప్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఫీల్‌ గుడ్‌ మూవీ ప్రతి ఒక్క పల్లెటూరులో 1990ల్లో ఇలాంటి కథలు జరిగే ఉంటాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోట్‌ చేసిన తీరు అందరికి నచ్చి కలర్‌ ఫొటోకు బ్రహ్మరథం పట్టారు.

కలర్‌ ఫొటో సినిమాపై సినీ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు ప్రశంసలు కురిపించి వావ్‌ అంటూ కామెంట్‌ పెట్టారు.ఆహా ద్వారా ముందే ఈ సినిమా ఫలితాన్ని ఊహించి విడుదల చేసిన అల్లు అరవింద్‌ ఫుల్‌ హ్యాపీ.

TeluguStop.com - నాన్న తీసుకున్న కలర్ ఫోటో’కు బన్నీ ప్రశంసలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ సినిమాకు ప్రమోట్‌ చేసే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్‌ ను రంగంలోకి దించాడు.
కలర్‌ ఫొటో యూనిట్‌ సభ్యులందరిని కూడా పిలిపించుకున్న బన్నీ వారికి శుభాకాంక్షలు తెలియజేశాడు.

చాలా బాగా సినిమాను తీశారు, చేశారు అంటూ అభినందించాడు.ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మరిన్ని చేయాలంటూ బన్నీ వారిని ప్రశంసించాడు.

మొత్తానికి అల్లు అర్జున్‌ ప్రశంసలతో కలర్‌ ఫొటో టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దాంతో మరో రెండు రోజుల పాటు కలర్‌ ఫొటోకు సంబంధించి సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కనుక కలర్ ఫొటోను మరింత మంది చూసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మొత్తానికి కలర్‌ పొటో ను నాన్న అల్లు అరవింద్‌ కొనుగోలు చేయడం వల్లే బన్నీ ప్రమోట్‌ చేసేందుకు ముందుకు వచ్చాడు అనేది కొందరి మాట.అసలు విషయం ఏది అయినా కూడా ఒక మంచి సినిమాను ప్రమోట్‌ చేసేందుకు బన్నీ ముందుకు రావడం అభినందనీయం అన్నారు.

#@kaalabhairava7 #@iChandiniC #@ActorSuhas #@SandeepRaaaj #@harshachemudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Comments On Suhas And Chandi Choudary Color Photo Movie Related Telugu News,Photos/Pics,Images..