కొత్త ఆఫీస్‌పై క్లారిటీ ఇచ్చిన బన్నీ  

Allu Arjun Comments On His New Office-allu Arjun Ala Vaikuntapuramlo,allu Arjun Latest Interview,allu Arjun New Office

అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు.సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్న అల్లు అర్జున్‌ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఈ సందర్బంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు.

Allu Arjun Comments On His New Office-allu Arjun Ala Vaikuntapuramlo,allu Arjun Latest Interview,allu Arjun New Office -Allu Arjun Comments On His New Office-Allu Ala Vaikuntapuramlo Allu Latest Interview Office

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇంతటి సక్సెస్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు.తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

మీకోసం ప్రత్యేకమైన ఆఫీస్‌ ఏంటీ, గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ ఉండగా కొత్త ఆఫీస్‌తో పనేంటీ అంటూ ప్రశ్నించగా అందుకు స్పందించిన బన్నీ.గీతా ఆర్ట్స్‌లో ఎప్పుడు మూడు నాలుగు సినిమాల వర్క్‌ జరుగుతూ ఉంటాయి.

అలాంటప్పుడు ఒకే ఆఫీస్‌ ఇబ్బందిగా ఉంది.అందుకే తాను ప్రత్యేకమైనా ఆఫీస్‌ను తీసుకున్నాను.అంతకు మించి నిర్మాణ సంస్థ స్థాపించాలని కాని, కొత్తగా మరేదో చేయాలనే ఉద్దేశ్యం కాని నాకు లేదు అంటూ ఈ సందర్బంగా బన్నీ చెప్పుకొచ్చాడు.

నా పేరు సూర్య చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ రావడంతో ఫ్యాన్స్‌ అంతా కొంత ఆందోళన వ్యక్తం చేశారు.కాని వారికి సరైన సక్సెస్‌ను ఈ చిత్రంతో బన్నీ ఇచ్చాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేల ఈ చిత్రం ఉంటుందని మొదటి నుండి చెప్పారు.

అన్నట్లుగానే ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.బన్నీ ఈ చిత్రంతో మరో మెట్టు పైకి ఎక్కినట్లయ్యింది.

తాజా వార్తలు

Allu Arjun Comments On His New Office-allu Arjun Ala Vaikuntapuramlo,allu Arjun Latest Interview,allu Arjun New Office Related....