తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 )లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య( Anand Deverakonda Vaishnavi Chaitanya ) కలిసి నటించిన తాజా చిత్రం బేబీ.సాయి రాజేష్( Sai Rajesh ) దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.కాగా ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా గురువారం హైదరాబాదులో సక్సెస్ మీట్( Baby Movie Successmeet ) ను నిర్వహించారు చిత్ర బృందం.
కాగా ఈ సక్సెస్ మీట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలాగే ఈ సక్సెస్ మీట్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.చిరంజీవిగారికి బేబీ చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ వీరాభిమాని.సోషల్ మీడియాలో చిరంజీవి ( Chiranjeevi )పై ఎవరన్నా కామెంట్ చేస్తే ఘాటుగా సమాధానం స్పందిస్తూ ఉంటారు.అది గమనించిన అల్లు శిరీష్ ఏలూరులో ఉన్న ఎస్.కె.ఎన్‌ను తమ దగ్గరకురమ్మని పిలిపించాడు.అలా ఎస్‌కెఎన్ మా ఫ్యామిలీలో భాగమయ్యాడు అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్.
అనంతరం మాట్లాడుతూ చిరంజీవి మీదున్న అభిమానాన్నిచాటుకున్నారు అల్లు అర్జున్.కట్టే కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే.
అది ఎప్పటికీ మారదు అని అల్లు అర్జున్ అన్నారు.గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ( Allu Family )కి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు వచ్చాయి అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఆ వార్తలకు కూడా చెక్ పెట్టేశారు అల్లు అర్జున్.బేబీ సక్సెస్ మీట్ లో భాగంగా అల్లు అర్జున్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.