ప్రభాస్ తర్వాత భారీ రెమ్యునరేషన్ అల్లు అర్జున్‌దేనట.. ఆ ప్రొడక్షన్ లో భారీగా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.గంగోత్రి,ఆర్య లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ, తన మాటలతో డాన్స్ తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

 Allu Arjun Charging High Remunaration For His Next Movie With Lyca Productions, Allu Arjun, Prabhas, Remuneration, Lyca Productions-TeluguStop.com

మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఆ తాజాగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

పుష్ప సినిమా అల్లు అర్జున్ కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టడమే కాకుండా గత ఏడాది విడుదలైన సినిమాలన్నింటిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

దాదాపుగా మూడు వందల కోట్ల గ్లాస్ ను కొల్లగొట్టింది.

బాలీవుడ్ లో అయితే ఏకంగా 75 కోట్లు కలెక్షన్ రావడంతో అక్కడ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.ఇక పుష్పా సినిమా పార్ట్ వన్ చూసినవారు, సెకండ్ పార్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక చిత్ర బృంధం సెకండ్ పార్ట్ షూటింగ్ ను ఫిబ్రవరి లేదా మార్చి లో మొదలు పెట్టనుంది.పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరొక వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే దక్షిణాది నిర్మాణ సంస్థ అల్లుఅర్జున్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధపడిందట.

అందుకోసం అల్లు అర్జున్ కి భారీగా రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ పై బన్నీ కన్ను పడింది అని తెలుస్తోంది.

అయితే ఆ ప్రొడక్షన్ లో బన్నీ సినిమా చేయడానికి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోల్లో ప్రభాస్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.ఇక ప్రభాస్ తర్వాత ఆ స్థానం అల్లు అర్జున్ ది కాబోతోంది.ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Allu Arjun High Remuneration For Lyca Productions Movie Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube