ఆమె హీరో అన్న బన్నీ

గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ చిత్రంకు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి.ఇప్పటికే 50 కోట్లను క్రాస్‌ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 Allu Arjun Called Anushka As Hero-TeluguStop.com

గోనగన్నారెడ్డి పాత్ర లేకుంటే రుద్రమదేవి చిత్రం లేదు అన్నంతగా అల్లు అర్జున్‌ ఈ చిత్రంలో దుమ్ము రేపాడు.ఈ చిత్రం కోసం అల్లు అర్జున్‌ పని చేసింది కేవలం నెల రోజులే.

అయినా కూడా అంత క్రెడిట్‌ అంతా కూడా తానే దక్కించుకున్నాడు.తాజాగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న బన్నీ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది.ఈ చిత్రం కోసం గుణశేఖర్‌ చాలా కష్టపడ్డారు.

ఇక అనుష్క ఈ చిత్రం కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డారు.ఈ చిత్రానికి నిజమైన హీరో అనుష్క అని అల్లు అర్జున్‌ అన్నాడు.

తాను కేవలం 30 రోజులు మాత్రమే ఈ సినిమా కోసం కష్టపడ్డాను అని, అనుష్క పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కిందని అన్నాడు.ఈ చిత్రంలో తాను చేసిన చిన్న పాత్రే అని, సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా కూడా అనుష్క, గుణశేఖర్‌లకు చెందుతుందని బన్నీ చెప్పుకొచ్చాడు.

ఈ సక్సెస్‌మీట్‌లో కృష్ణంరాజు, ప్రకాష్‌ రాజ్‌, దిల్‌రాజు పలువురు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube