క్వాలిటీ కావాలంటే లేట్ అవుతుంది అంటున్న సుకుమార్  

sukumar on pushpa movie shooting, Tollywood, Allu Arjun, Bunny, Director sukumar - Telugu Allu Arjun, Bunny, Director Sukumar, Sukumar On Pushpa Movie Shooting, Tollywood

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ రంగస్థలం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గా బన్నీతో పుష్ప సినిమాని ఎనౌన్స్ చేశాడు.ఈ సినిమా ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు.

 Allu Arjun Bunny Director Sukumar

త్వరలో షూటింగ్ కి వెళ్ళిపోతుంది అనగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిపోయింది.ఈ సినిమా కథ పూర్తిగా నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో నడుస్తుందని తెలుస్తుంది.

ఫస్ట్ లుక్ ద్వారానే సినిమా కథ ఎలా ఉండబోతుంది అనేది సుకుమార్ రివీల్ చేసేశారు.ఇందులో బన్నీ చేస్తున్న పుష్ప పాత్ర చాలా పవర్ ఫుల్ గా మాసివ్ గా ఉండబోతుంది.

క్వాలిటీ కావాలంటే లేట్ అవుతుంది అంటున్న సుకుమార్-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది.ఇందులో కూడా అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత కొరటాల సినిమాని లైన్ లో పెట్టాడు.

తాజాగా ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది.ఈ నేపధ్యంలో పుష్ప సినిమాని తొందరగా స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా పూర్తి చేయాలని బన్నీతో పాటు నిర్మాతలు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే షూటింగ్ ఆగిపోయి మూడు నెలలకి పైగా అయిపోవడంతో నిర్మాతలపై అదనపు భారం పడుతుందని, అందుకే తొందరగా కంప్లీట్ చేయాలని సుకుమార్ కి చెప్పడంతో అతను కాస్తా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినిపిస్తుంది.సినిమా కథ ప్రకారం చాలా వరకు ఫారెస్ట్ లోనే షూటింగ్ చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయిన కూడా సినిమా క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పినట్లు తెలుస్తుంది.

సినిమా క్వాలిటీ భాగా రావాలంటే కచ్చితంగా షూటింగ్ ఆలస్యం అవుతుందని, తొందరగా పూర్తి చేయడం తన వలన కాదని కరాఖండిగా చెప్పెసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

#Bunny #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Bunny Director Sukumar Related Telugu News,Photos/Pics,Images..