46 మంది చేతుల మీదుగా అల్లు అర్జున్‌ బర్త్‌ డే డీపీ

అల్లు అర్జున్‌ తన పుట్టిన రోజును ఈనెల 8వ తారీకున జరుపుకోబోతున్న విషయం తెల్సిందే.బన్నీ పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న పుష్ప సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

 Allu Arjun Birthday Common Dp Released By 46 Celebrities , Allu Arjun, Pushpa, A-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి వీడియో రాలేదు.మొదటి సారి రాబోతున్న వీడియో కోసం అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.

ఇక ఈమద్య కాలంలో అందరు హీరోలకు మరియు హీరోయిన్స్‌ కు కూడా బర్త్‌ డే సందర్బంగా కామన్‌ డీపీని విడుదల చేస్తున్నారు.అల్లు అర్జున్‌ వంటి సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే కు కామన్‌ డీపీ విడుదల చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి.

అందుకే అల్లు అర్జున్‌ బర్త్‌ డే కామన్‌ డీపీని భారీ ఎత్తున విడుదల చేశారు.

సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో టాలీవుడ్‌ స్టార్ హీరోలు దర్శకులు హీరోయిన్స్‌ బుల్లి తెరకు చెందిన ఒకరు ఇద్దరు స్టార్స్‌ అంతా కలిపి మొత్తం 46 మంది ప్రముఖులు అల్లు అర్జున్‌ కామన్‌ డీపీని షేర్‌ చేశారు.ట్విట్టర్‌ లో ఒకేసారి అంత మంది ప్రముఖులు హ్యాష్‌ ట్యాగ్‌ తో షేర్‌ చేయడం వల్ల కొన్ని సెకన్లలో రికార్డు స్థాయిలో ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ట్వీట్స్‌ ను నమోదు చేసింది.ఈ రేంజ్‌ ట్వీట్స్‌ ను వారు ఊహించలేదు అంటున్నారు.

మొత్తంగా ట్విట్టర్‌ లో అల్లు అర్జున్‌ కామన్‌ డీపీ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.పెద్ద ఎత్తున నమోదు అవుతున్న ట్వీట్స్‌ ప్రస్తుతం ట్విట్టర్‌ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌ తో బిజీగా ఉన్నా కూడా అల్లు అర్జున్‌ ఈ బర్త్‌ డే ను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు చిన్న బ్రేక్‌ తీసుకున్నాడు.మొత్తంగా 46 మంది సెలబ్రెటీ స్టార్స్‌ బన్నీ కామన్ డీపీ విడుదల చేసిన నేపథ్యంలో సరికొత్త రికార్డు నమోదు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube