హోస్ట్ గా మారనున్న అల్లు అర్జున్.. ఆహా కోసం అల్లు అరవింద్ మాయలు మాములుగా లేవుగా?

కరోనా పుణ్యమా అంటూ ఓటీటీల హవా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో మొట్ట మొదటిసారిగా తెలుగు ఓటీటీ ఆహా ఏర్పాటు చేశారు.

 Allu Arjun Became Host For The Aha Show Details, Allu Arjun, Tollywood, Host, Aha, Film Industry, Aha Show, Allu Arjun Aha Show, Producer Allu Aravind, Balakrishna Unstoppable Show, Venkatesh, Aha Talk Show-TeluguStop.com

ఆహా ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం తమిళంలో కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత అల్లు అరవింద్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఆహా కోసం కూడా అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్, టాక్ షోలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ వస్తున్నారు.ఇక ప్రస్తుతం ఆహా వేదికగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో లో టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొని నెం.1 షో గా ఈ టాక్ షో నీ నిలబెట్టారు.అలాగే జాతీయస్థాయిలో ఈ టాక్ షో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

 Allu Arjun Became Host For The Aha Show Details, Allu Arjun, Tollywood, Host, Aha, Film Industry, Aha Show, Allu Arjun Aha Show, Producer Allu Aravind, Balakrishna Unstoppable Show, Venkatesh, Aha Talk Show-హోస్ట్ గా మారనున్న అల్లు అర్జున్.. ఆహా కోసం అల్లు అరవింద్ మాయలు మాములుగా లేవుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా ఆహాకు మరింత క్రేజ్ తీసుకురావడం కోసం అల్లు అరవింద్ సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Aha Show, Allu Arjun, Alluarjun, Allu Aravind, Tollywood, Venkatesh-Movie

బాలయ్య తరహాలోనే మరొక రియాలిటీ షో ద్వారా విక్టరీ వెంకటేష్ ను వ్యాఖ్యాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయం గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ మరొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.అల్లు అరవింద్ ఆహా ద్వారా సరికొత్త టాక్ షో ద్వారా అల్లు అర్జున్ వ్యాఖ్యాతగా ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం.

Telugu Aha Show, Allu Arjun, Alluarjun, Allu Aravind, Tollywood, Venkatesh-Movie

మామూలుగానే బన్నీకి ఎంతో మంది అభిమానులు అలాంటిది ఒక టాక్ షో ద్వారా ఆయన ప్రేక్షకులను సందడి చేయడానికి వస్తున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.ఇదే కనుక నిజమైతే ఆహా మరో స్థాయికి ఎదుగుతుందని చెప్పవచ్చు.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆహా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube