వైజాగ్ లో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న ఐకాన్ స్టార్.. తగ్గేదేలే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒక్క సినిమాతో అమాంతం పెరిగి పోయింది.ఇంతకు ముందు వరకు కేవలం సౌత్ మాత్రమే అల్లు అర్జున్ ను ఆరాధించే వారు.

 Allu Arjun At Vizag Airport Pics Viral Details, Allu Arjun, Pushpa 2 , Director-TeluguStop.com

కానీ ఇప్పుడు అలా కాదు.మన కంటే బాలీవుడ్ ప్రేక్షకులు బన్నీని ఆరాధిస్తున్నారు.

అల్లు అర్జున్ పుష్ప 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.మరి ఈయనపై ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటో అందరికి తెలుసు.

అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 పుష్ప ది రూల్ మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

పుష్ప 2 షూట్ ఇటీవలే స్టార్ట్ అయినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు పుష్ప 2 టీమ్ అంతా వైజాగ్ చేరుకున్నారు అనే వార్త టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.వైజాగ్ లో బన్నీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లు అర్జున్ ఎప్పుడు అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ ఆర్మీ ఈయనకు ఘనంగా వెల్కమ్ చెబుతుంది.

మరి ఈసారి కూడా నిన్న రాత్రి సమయంలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బన్నీ క్రేజ్ ఏ రేంజ్ కు చేరుకుందో వీటిని చూస్తుంటేనే అర్ధం అవుతుంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

చూడాలి మరి పుష్ప షూట్ ఎంత త్వరగా పూర్తి చేస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube