బాలయ్య పాత్రలో బన్నీ.. రయ్యిరయ్యి మంటూ వెళ్లడమే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 Allu Arjun As Lorry Driver In Sukumar Movie-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బన్నీ బాక్సాఫీస్ గూబ గుయ్యిమనేలా సౌండ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమా తరువాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో బన్నీ పాత్రపై అనేక వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.ఈ సినిమాలో బన్నీ స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తాడని వార్త హల్ చేస్తోంది.

అయితే తాజాగా బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడని, ఆయన చాలా రఫ్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.గతంలో లారీ డ్రైవర్ అనే సినిమాలో బాలయ్య అదరగొట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది.అల వైకుంఠపురములో సినిమాలో క్లాస్ లుక్‌తో అదరగొట్టేందుకు రెడీ అయిన బన్నీ సుకుమార్ సినిమాలో రఫ్ లుక్‌లో ఎలా మెప్పిస్తాడో చూడాలి అంటున్నారు సినీ జనం.ఏదేమైనా ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube