ఫ్యాన్స్‌ ప్రశ్న : ఒక తండ్రి కోసం కొడుకు అడిగితే తప్పేంటి

అల్లు అర్జున్‌ ఇటీవల జరిగిన అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిల్‌ నైట్‌ కార్యక్రమంలో తన తండ్రి అల్లు అరవింద్‌ తెలుగు సినిమా పరిశ్రమకు చాలా సేవలు చేశాడు.ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే.

 Allu Arjun Aravind Son Asks For A Father-TeluguStop.com

తన తండ్రికి అవార్డు ఇవ్వడం తెలుగు సినిమాను గౌరవించినట్లవుద్దని ఈ సందర్బంగా అల్లు అర్జున్‌ అన్నాడు.అల్లు అర్జున్‌ చేసిన రిక్వెస్ట్‌పై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు.

ముఖ్యంగా అల్లు అర్జున్‌ అప్పీల్‌ను చాలా మంది విమర్శిస్తున్నారు.

తండ్రి కోసం అవార్డు అడుక్కోవడం ఏంటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అవార్డు అనేది చేసిన సేవకు గుర్తింపు దక్కి రావాలి కాని మనం అడుకోవడం వల్ల రాదు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.అలా అడుక్కోగా వచ్చిన అవార్డు కూడా అంత విలువ తీసుకు రాదు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

Telugu Alavaikunta, Allu Aravind, Allu Arjun, Son-Latest News - Telugu

ఒక తండ్రికి గౌరవం దక్కాలి అంటూ ఏ కొడుకు అయినా అనుకుంటాడు.అదే అల్లు అర్జున్‌ కోరుకున్నాడు.ఒక హీరో అయినంత మాత్రాన బన్నీ కొడుకు కాకుండా పోతాడా.

అల్లు అరవింద్‌ ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డుకు అర్హుడు.అలాంటప్పుడు అల్లు అర్జున్‌ అడిగితే ఏంటీ మరెవ్వరైనా అడిగితే ఏంటీ అంటూ మెగా ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

అల్లు అర్జున్‌ డిమాండ్‌ను తాము ముందుకు తీసుకు వెళ్తామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ విజ్ఞప్తిని అందిస్తామంటూ ఈ సందర్బంగా మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube