పాపం బన్నీ మరియు రౌడీలు ఇంకా ఎన్ని రోజులు పెంచుకుని తిరగాలో..!

కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి కూడా షూటింగ్స్ సరిగా సాగడం లేదు.మద్యలో మూడు నాలుగు నెలలు షూటింగ్ లు జరిగినా కూడా పెద్ద సినిమాలు పూర్తి అయ్యింది లేదు.

 Allu Arjun And Vijay Devarakonda Facing Problems With Corona Shooting Break-TeluguStop.com

దాంతో బడా సినిమాలన్నీ కూడా ఏళ్లకు ఏళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.ఆ సినిమాల కోసం హీరోలు కొత్త ప్రాజెక్ట్‌లు కమిట్ కాకుండా ఉంటున్నారు.

అల్లు అర్జున్‌ మరియు విజయ్ దేవరకొండలది వింత పరిస్థితి.బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమా లో నటిస్తుండగా విజయ్ దేవరకొండ మాత్రం లైగర్‌ సినిమాలో నటిస్తున్నాడు.

 Allu Arjun And Vijay Devarakonda Facing Problems With Corona Shooting Break-పాపం బన్నీ మరియు రౌడీలు ఇంకా ఎన్ని రోజులు పెంచుకుని తిరగాలో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సినిమా ల్లో ఈ ఇద్దరు హీరోల లుక్స్‌ విషయానికి వస్తే చాలా కొత్తగా విభిన్నంగా కనిపించబోతున్నారు.ఇద్దరు కూడా జట్టు గడ్డం పెంచి కనిపించబోతున్నారు.

వారి వారి సినిమా ల కోసం వీరిద్దరు గత కొన్ని రోజులుగా జట్టు పెంచుకుంటున్నారు.గత ఏడాది ఆరంభం నుండి అల్లు అర్జున్ మరియు విజయ్‌ దేవరకొండ జట్టు పెంచుకుని కనిపిస్తున్నారు.

షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు కట్టింగ్‌ చేయించుకోకుండా జుట్టు తోనే వారు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది.జుట్టు కట్‌ చేయడం వల్ల లుక్ లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే జుట్టు కట్‌ చేయకుండా అలాగే కొనసాగిస్తున్నారు.జుట్టు కట్‌ చేసుకోకుండా ఏడాది పాటు ఉండటం అంటే చాలా చిరాకు కలిగించే విషయం.

ఇద్దరు కూడా మళ్లీ షూటింగ్‌ ఏ క్షణంలో అయినా మొదలు అయ్యే అవకాశం ఉంది కనుక జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జుట్టు నుండి ఫిజిక్‌ వరకు అనేక విషయంలో హీరోలు సినిమాల కోసం మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది.

సినిమా ఆరంభం నుండి గుమ్మడి కాయ కొట్టే వరకు కూడా సేమ్‌ లుక్ ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.అలా చేయక పోతే సినిమా లో ఫీల్‌ మిస్ అవుతుంది.

అందుకే వీరిద్దరు హీరోలు ఇంకా ఎంత కాలం జుట్టు పెంచుకుని తిరగాలో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

#CoronaShooting #Heroes Problems #DifferentHair #Allu Arjun #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు