బన్నీ, త్రివిక్రమ్‌ ఏదో జరుగుతుంది.. మహేష్ బాబు ఫ్యాన్స్‌ టెన్షన్‌

అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.తెలుగు లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు ఆ స్థాయి లో ఉండటం అనేది చాలా కామన్‌ విషయం.

 Allu Arjun And Trivikram Meeting Mahesh Babu Fans Tension Allu Arjun, Trivikram,-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న పుష్ప 2 సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది.ఇప్పటికే సుకుమార్‌ ఆ పనిలో నిమగ్నం అయ్యి ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే పుష్ప 2 సినిమా స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్న సమయంలో నే అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్‌ కలవడం తో చర్చ హాట్‌ హాట్‌ గా జరుగుతోంది.అసలు ఏం జరుగుతుంది అంటూ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు.

మహేష్ బాబు తో త్రివిక్రమ్‌ మూవీ ప్రకటించి చాలా కాలం అయ్యింది.మహేష్‌ బాబు తో సినిమా కంటే ముందు ఎన్టీఆర్‌ తో త్రివిక్రమ్‌ సినిమా ను ప్రకటించాడు.

కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాకుండానే క్యాన్సిల్‌ అయ్యింది.

ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా మొదలు కాకుండానే క్యాన్సిల్‌ అయ్యేనా ఏంటీ అంటూ మహేష్ బాబు అభిమానులు ఒకింత ఆందోళనతో ఉన్నాడు.

అల వైకుంఠపురం లో సినిమా తర్వాత త్రివిక్రమ్‌ ఇప్పటి వరకు సినిమా మొదలు పెట్టలేదు.సినిమా ను అదుగో ఇదుగో అంటూ దాట వేస్తూ.

వాయిదా వేస్తూ మహేష్ బాబు ఆలస్యం చేస్తున్న నేపథ్యం లో త్రివిక్రమ్‌ ఏమైనా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా అంటున్నారు.మరో వైపు సుకుమార్ కూడా పుష్ప 2 లేట్‌ చేస్తుండటంతో త్రివిక్రమ్‌ మాదిరిగానే బన్నీ కూడా విసిగి పోయి ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ఇద్దరు కలవడం తో ఇద్దరి మద్య సినిమా చర్చ జరిగిందని వార్తలు వస్తున్న సమయంలో వెంటనే వీరి కాంబో మూవీ ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.ఇప్పటికే మూడు సినిమా లు వీరి కాంబోలో వచ్చి ఆ మూడు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక డబుల్‌ హాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube