అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మరింత క్లారిటీ ఇచ్చారు  

Allu Arjun And Trivikram Gives Full Clarity On Upcoming Movie-allu Arjun And Trivikram,allu Arjun Next Movie,anasuya,jabardast,rashmi,tollywood Box Office,trivikram,valmiki,varun Tej

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రం విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు తెర పడ్డట్లయ్యింది.మొదట ఇదే ఏడాదిలో సినిమా విడుదల చేసి తీరాలని చాలా ప్రయత్నాలు చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ షూటింగ్‌లో వచ్చిన కొన్ని అంతరాయాలు మరియు బ్రేక్స్‌ కారణంగా సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించారు.ఇటీవల టీజర్‌ వచ్చిన సమయంలో సినిమా వచ్చే సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రకటించారు.

Allu Arjun And Trivikram Gives Full Clarity On Upcoming Movie-allu Arjun And Trivikram,allu Arjun Next Movie,anasuya,jabardast,rashmi,tollywood Box Office,trivikram,valmiki,varun Tej-Allu Arjun And Trivikram Gives Full Clarity On Upcoming Movie-Allu Allu Next Movie Anasuya Jabardast Rashmi Tollywood Box Office Trivikram Valmiki Varun Tej

సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్న కారణంగా ఈ చిత్రం ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి.అదే సమయంలో సినిమాను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.పుకార్లన్నింటిని పటాపంచలు చేస్తూ సినిమాను సంక్రాంతి కానుకగానే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాను.వచ్చే ఏడాది సంక్రాంతి సందర్బంగా జనవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా సంక్రాంతికి రాబోతున్న విషయం తెల్సిందే.మరి అల వైకుంఠపురంలో చిత్రంను 12వ తారీకు విడుదల చేస్తే సరిలేరు నీకెవ్వరు ఏ రోజు విడుదల చేస్తారో చూడాలి.ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా మరో రెండు లేదా మూడు సినిమాలు కూడా సంక్రాంతి రోజు విడుదల కాబోతున్నాయి.

ప్రతి సంవత్సరం సంక్రాంతికి సినిమాలు రెండు మూడు వస్తాయి.కాని ఈసారి మాత్రం పోటీ ఎక్కువ ఉండేలా అనిపిస్తుంది.