పుష్ప సూపర్‌ న్యూస్‌.. రన్ టైమ్‌ తో ఫ్యాన్స్ కు పూనకాలే

అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఈ సినిమా కు సంబంధించిన ఐటెం సాంగ్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.

 Allu Arjun And Sukumar Movie Pushpa Run Time, Allu Arju , Sukuma, Pushpa Movie ,-TeluguStop.com

సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.దాంతో సినిమా విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ బజ్‌ ఒకటి వచ్చింది.అదేంటి అంటే ఈ సినిమా రన్‌ టైమ్‌ రెండు గంటల నలబై నిమిషాలు ఉండబోతుందట.

ఇంకా పాట చిత్రీకరణ కాలేదు ఇంకా ఫైనల్‌ ఎడిట్ అవ్వలేదు అప్పుడె ఎలా అంటూ కొందరికి అనుమానాలు రావచ్చు.పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది.

మిగిలిన షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది.పాట కాకుండా ఇప్పటికే ఎడిటింగ్‌ కూడా పూర్తి చేశారట.

నాలుగున్నర నిమిషాల నిడివితో పాట ఉంటుందట.ఆ పాటను జత చేస్తే రెండు గంటల నలబై నిమిషాలు ఉండేలా ప్లాన్‌ చేస్తారు.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్న నేపథ్యంలో మరియు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సినిమా కు అన్ని వైపుల నుండి పనులు జరుగుతున్నాయి.ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

కనుక రన్‌ టైమ్‌ విషయంలో లీక్ వచ్చింది.మొత్తానికి రెండు గంటల నలబై నిమిషాల రన్ టైమ్‌ అంటే ఖచ్చితంగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఓ రేంజ్‌ లో ఎంటర్‌ టైన్ అవుతారని అంటున్నారు.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Run Time, Run Time, Sukumar, Tollywood-Movie

రంగస్థలం దాదాపుగా మూడు గంటలు ఉంది.కాని ఈసారి 20 నిమిషాలు తక్కువగా ప్లాన్‌ చేస్తున్నాడు సుకుమార్‌.రంగస్థలం సినిమా విడుదల తర్వాత ఒకటి రెండు సన్నివేశాల్లో కట్‌ చేయాల్సి వచ్చింది.పుష్పకు ఆ పని చేయకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube